రఫ్ఫాడిస్తున్న ధోని ..

SMTV Desk 2019-06-04 16:26:12  MS Dhoni,

సౌథాంప్టన్: వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్ల తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. భారత జట్లు వికెట్ కీపర్ ధోనీ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ బాగా కష్టపడుతున్నారు. ధోనీ బంతిని బలంగా బాదిన వీడియో బిసిసిఐ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తుండగా ధోనీ బ్యాటింగ్ చేశాడు. మరోవైపు కెఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం దక్షిణాప్రికాతో భారత జట్టు ఆడనుంది. ఇప్పటికే సౌతాఫ్రికా రెండు ఓటములను చవిచూసింది. వరల్డ్‌కప్‌ లో భారత్‌పై సపారీలు పైచేయి సాధించారు. రెండు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగగా మూడు సార్లు సఫారీలు గెలువగా భారత జట్టు ఒక్కసారి విజయం సాధించింది.