వైరల్ అవుతున్న డోనాల్డ్ ట్రంప్ న్యూ హెయిర్ స్టైల్

SMTV Desk 2019-06-04 16:22:34  Donald Trump,

అమెరికా అధ్యక్షుడు సోమవారం యూకేలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హెయిర్ స్టైల్ ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడైనప్పటి నుండి అంటే గత మూడేళ్ల నుండి ట్రంప్‌ స్టైల్‌ ఏమీ మారలేదు. అయితే ట్రంప్‌ తొలిసారిగా అధికారిక పర్యటనకు యూకే వచ్చిన సందర్భంగా ఆయన తన హెయిర్‌స్టైల్‌ మార్చినట్లు సమాచారం. క్వీన్ ఎలిజబెత్ తో మీటింగ్ సమయంలో ఆయన హెయిర్ స్టైల్ మారినట్టు గుర్తించారు. ఇక అయన రెండు రోజుల పాటు ఆయన యూకేలో పర్యటిస్తారు. అయితే ఆయన పర్యటన సందర్భంగా పర్యావరణ ఉద్యమకారులు వినూతన రీతిలో ఆయనకు ఆహ్వానం పలికారు. ఆయన స్టాన్స్‌టెడ్ విమానాశ్రయంలో దిగడానికి ఒక రోజు ముందు.. ‘బోర్న్ ఇకో’ అనే పర్యావరణవేత్తల టీమ్ విమానాశ్రయం పక్కనే ఉన్న పొలాల్లోని గడ్డిని అంగం రూపంలో కత్తిరించారు. పర్యవరణ పరిరక్షణ ఒప్పందాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న ధోరణిని వ్యతిరేకిస్తూ యూకేలో ఈ విధంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన హెయిర్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుండడంతో ఈ విషయం మీద వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్‌ ఈ స్టైల్‌ను కొనసాగించరని, కొత్తగా ఉంటుందని ఒక సారి ప్రయత్నించినట్లు వైట్‌ హౌజ్‌ పేర్కొన్నారు.