అజిత్ దోవల్ పదవి కాలం పొడగింపు

SMTV Desk 2019-06-04 16:18:24  Ajith Goyal,

జాతీయ భద్రతా సలహాదారు గా అజిత్‌ దోవల్‌ పదవీ కాలాన్ని పొడగిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న దోవల్‌కు కేంద్రం క్యాబినెట్‌ హోదా ఇచ్చింది. దీంతో మరో ఐదేళ్ల వరకు దోవల్‌ను ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే గతంలో సహాయ మంత్రి హోదాలో జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందించిన అజిత్‌ దోవల్‌కు ప్రస్తుతం క్యాబినెట్‌ హోదా కల్పించారు. కాగా,జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు చేపట్టకముందు దోవల్‌ ఐబీ చీఫ్‌గా వ్యవహరించారు. అజిత్‌ దోవల్‌ మార్గదర్శకత్వంలో యూరి ఉగ్రదాడి అనంతరం 2016లో పాకిస్తాన్‌పై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టగా, పుల్వామా దాడి అనంతరం 2018లోనూ బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్‌ స్ర్టైక్స్‌ నిర్వహించింది.