కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నూతన మంత్రులు

SMTV Desk 2019-06-04 16:15:07  smiti irani,

కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కించుకున్న పలువురు నాయకులు తమ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ న్యాయ శాఖ, కమ్యూనికేషన్ల మంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖలకు చెందినఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అటు..స్మృతి ఇరానీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో టెక్స్ టైల్, హెచ్ ఆర్డీ మినిస్టర్ గా పని మాజీ ఆర్మీ జనరల్ వీకే సింగ్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొనేందుకు వినూత్న రీతిలో సైకిల్ పైన కార్యాలయానికి చేరుకున్నారు హర్షవర్థన్. ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అయితే బాధ్యతలు చేపట్టిన వీరు గత ప్రభుత్వంలోనూ వివిధ శాఖలకు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు.