డోపింగ్ టెస్ట్ కు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ..

SMTV Desk 2019-06-04 16:13:47  Jasprit bumrah,

భారత క్రికెట్ పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు డోప్ టెస్ట్ జరుగనుంది. ర్యాండమ్‌ టెస్ట్ లో భాగంగా యూరిన్ శాంపిల్‌ ఇవ్వాలని బుమ్రాకు వాడా తరఫున పనిచేసే ఏజన్సీ నుంచి సమాచారం అందింది. వాడా తరఫున ఇదే ఏజెన్సీ శాంపిల్ ను పరీక్షించి, బుమ్రా ఏమైనా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడా? అన్న విషయాన్ని తేల్చనుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే, మరోసారి శాంపిల్ తీసుకుని పరీక్షలు నిర్వహిస్తారు. అప్పుడు కూడా అదే రిజల్ట్స్ వస్తే, తీసుకున్న ఉత్ప్రేరకం చూపే ప్రభావం ఆధారంగా కఠిన నిర్ణయాలు ఉంటాయి. అది ఆటగాడిపై నిషేధం వరకూ ఉండవచ్చు. ప్రపంచకప్‌ ఆడుతున్న ఆటగాళ్లకు నిర్వహిస్తున్న డోప్‌ పరీక్షల్లో భాగంగా వాడా డోప్‌ టెస్టు నిర్వహించినుంది. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో బుధవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు డోప్‌ టెస్ట్ నిర్వహించారు. టీమిండియాకు బుమ్రా కీలక బౌలర్ ఈనేపధ్యంలోనే ఈ టెస్ట్ జరగనుంది. తొలి మ్యాచ్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్స్ లో శ్రమిస్తున్నారు.