నిషా అగర్వాల్ కొడుకుతో కాజల్

SMTV Desk 2019-06-04 16:11:20  Nisha Agarwal, Kajal,

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ తో పాటు అభినయంతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె చేసిన ఎన్నో సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అయితే.. గత కొంతకాలంగా ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోతున్నాయి.

అది వేరే విషయం అనుకోండి. అయితే కాజల్ అగర్వాల్ హీరోయిన్ చెల్లెలు నిషా అగర్వాల్ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత నిషా.. బిజినెస్ మెన్ ను వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. కాగా వీరికి ఓ బాబు ఉన్నాడు. వాడి పేరు ఇషాన్. తాజాగా చెల్లెలు నిషా అగర్వాల్ కొడుకుతో పెద్దమ్మ కాజల్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోను సోసిల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.