చెలరేగిన పాక్ ఆటగాళ్లు .. ఇంగ్లాండ్ లక్ష్యం 349

SMTV Desk 2019-06-04 15:36:42  Eng land, Pakistan

వరల్డ్ కప్-2019లో భాగంగా ఇంగ్లండ్ జరుగుతున్న మ్యాచ్ లో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.ఫస్ట్ మ్యాచ్ లో తడబడ్డ పాక్..ఈ మ్యాచ్ లో బిగ్ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ..ఇంగ్లండ్ కు చాలెంజింగ్ టార్గెట్ ను విసిరింది. పాక్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు ఫ‌క‌ర్ జ‌మాన్, ఇమామ్ ఉల్ హ‌క్ ఆచితూచి ఆడి ఫస్ట్ వికెట్‌కు 82 ర‌న్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లందరు సమిష్టిగా రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో పాక్ 8 వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది.

పాక్ ప్లేయర్లలో..ఫ‌క‌ర్ జ‌మాన్(36), ఇమామ్ ఉల్ హ‌క్(44), బాబర్ ఆజామ్(63), హాఫీజ్(84), సర్ఫరాజ్(55) ఎక్కువ రన్స్ చేశారు.

ఇంగ్లండ్ బౌలర్లలో..మొయిన్ అలీ(3), క్రిస్ వోక్స్(3), మార్క్ ఉడ్(2) వికెట్లు తీశారు.