ముక్కలైన మాహాకూటమి

SMTV Desk 2019-06-04 15:35:45  sp, bsp,

ఉత్తరప్రదేశ్ లో మహా కూటమి ముక్కలైంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తో పొత్తుకు బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) గుడ్‌బై చెప్పింది. రానున్న ఉప ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు.

అదేవిధంగా యాదవుల ఓట్లలో చీలకను నివారించడంలో అఖిలేష్‌ యాదవ్‌ విఫలమయ్యారని లక్నోలో జరిగిన బీఎస్పీ కీలక సమావేశంలో మాయావతి ఈ మాటలు అన్నట్లు తెలుస్తోంది. అలాగే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆమె పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆరు రాష్ట్రాల ఎలక్షన్‌ కోఆర్డినేటర్లతో పాటు రెండు రాష్ట్రాల అధ్యక్షులను కూడా మాయావతి తొలగించారు.