పాండ్యా ప్రాక్టీస్ పిక్...వైరల్

SMTV Desk 2019-06-04 15:31:25  hardik pandya

ప్రపంచకప్ టోర్నీలో జూన్ 5న టీంఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనున్న నేపథ్యంలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా బీసీసీఐ శనివారం ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి క్యాప్షన్ చెప్పాలని కోరింది. సాధారణంగానే నెటిజనులు ఫొటోలకు పేర్లు పెట్టడంలో ముందుంటారు. అలాంటిది క్యాప్షన్ అడిగితే ఊరుకుంటారా? జోకులు.. మీమ్స్.. ఫన్నీ కామెంట్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. చివరికి సినీ దిగ్గజం కరణ్ జోహార్‌కు, ఇటీవల ట్రెండవుతున్న JcbKiKudhayiతోనూ ముడిపెట్టి మరీ జోకులేస్తున్నారు.