బ్యాంకు సేవలకు చార్జీలు చెల్లించాల్సిందే!

SMTV Desk 2019-06-04 15:24:02  bank customers, bank services

బ్యాంకు నుంచి వచ్చే సేవ ఉచితంగా లభిస్తున్నాయని అనుకుంటారు కాని ఆ సేవలు పొందడానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అకౌంట్ స్టేట్‌మెంట్ కావాలంటే కొంత చెల్లించాల్సిందే. అయితే అదే మీరు అకౌంట్ స్టేట్‌మెంట్‌ను యాప్‌లో ఉచితంగానే చూసుకోవచ్చు. అలాగే ✺ బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలి. మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే చాలా బ్యాంకులు ఖాతాదారుల నుంచి పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐ ఖాతాదారులు (మెట్రో, పట్టణాలు) వారి అకౌంట్లలో రూ.3,000 కలిగి ఉండాలి. అదే పాక్షిక పట్టణాల్లో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు రూ.2,000, గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు రూ.1,000 కలిగి ఉండాలి. ✺ డెబిట్ కార్డు జారీకి కూడా బ్యాంకులు కొంత డబ్బుల్ని తీసుకుంటాయి. డెబిట్ కార్డు జారీ, వాటి వార్షిక మెయింటెనెన్స్ వంటి చార్జీలు వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డులకు ఉచితంగానే అందిస్తాయి. డెబిట్ కార్డు చార్జీలు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. ✺ చెక్ బుక్ చార్జీలు కూడా ఉంటాయి. ఒకవైపు ఆన్‌లైన్ లావాదేవీల జోరు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ కూడా కొందరు చెక్ బుక్స్ ఉపయోగిస్తున్నారు. కొన్ని బ్యాంకులు చెక్ బుక్స్‌ జారీ కోసం కొంత మొత్తాన్ని తీసుకుంటాయి. కొన్ని బ్యాంకులు ఉచితంగానే చెక్ బుక్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి. ✺ బ్యాంకులు ఏటీఎం చార్జీలు కూడా వసూలు చేస్తాయి. సాధారంగా 3 నుంచి 5 వరకు ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఉచితంగానే ఉంటాయి. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి కొంత చెల్లించుకోవాలి.