ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

SMTV Desk 2019-06-04 13:53:03  Pakistan vs England

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ టీమ్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. వెస్టిండీస్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన పాకిస్థాన్‌ ఒత్తిడిలో ఉంది. 2016లో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై రికార్డు స్థాయిలో ఇంగ్లాండ్ 444 బాదిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టుకి సొంతగడ్డపై 2016 నుంచి ఛేదనలో తిరుగులేదు. ఎంతలా అంటే.. ఈ మూడేళ్లలో అక్కడ 20 వన్డేల్లో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్ ఏకంగా 17 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. ఇక మిగిలిన మూడింట్లో ఒకటి టైగా ముగియగా.. రెండింటిలో ఫలితం తేలలేదు.
Pakistan (Playing XI): Fakhar Zaman, Imam-ul-Haq, Babar Azam, Mohammad Hafeez, Sarfaraz Ahmed(w/c), Shoaib Malik, Asif Ali, Shadab Khan, Hasan Ali, Wahab Riaz, Mohammad Amir.
England (Playing XI): Jason Roy, Jonny Bairstow, Joe Root, Eoin Morgan(c), Ben Stokes, Jos Buttler(w), Moeen Ali, Chris Woakes, Jofra Archer, Adil Rashid, Mark Wood.