హిందీ రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా పాఠ్యాంశంగా చేయగలరా?

SMTV Desk 2019-06-04 13:51:49  revanth reddy

హిందీని దక్షిణాది రాష్ట్రాల్లో నిర్బంధ పాఠ్యాంశంగా చేయాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై ఎందుకు బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేనని, అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేయగలరా? అని ప్రశ్నించారు. పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ ఆక్రోశించారు.