రైతుబంధు పెంపుకు ఉత్తర్వులు జారీ

SMTV Desk 2019-06-03 16:42:15  Rythu Bandhu

తెరాస ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకొంటూ రైతుబంధు పంటపెట్టుబడి సాయాన్ని రూ.4,000 నుంచి రూ.5,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌లోనే రూ.12,000 కోట్లు కేటాయించింది కనుక త్వరలో మొదలవబోయే వర్షాకాలం నుంచే పెంచిన ఈ సొమ్మును రైతుల ఖాతాలలో జామా చేస్తామని తెలిపారు. గతంలోలాగే ఎకరానికి ఏడాదికి పట్టాదార్ పాసుపుస్తకాలు ఉన్న రైతులందరికీ వారికున్న భూమిని బట్టి పంటపెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. ఎటువంటి భూపరిమితి విధించకుండా పట్టాదార్ పాసుపుస్తకాలున్నవారందరికీ ఈ పధకాన్ని వర్తింపజేస్తున్నందున బడా భూస్వాములు, రాజకీయ నాయకులు, సినీతారాలు, పారిశ్రామికవేత్తలు కూడా దీనిని పొందుతున్నారు. పంటపెట్టుబడి సాయం అవసరంలేని అటువంటివారందరూ స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరుతూ త్వరలో విస్తృతంగా ప్రచారం చేస్తామని పార్థసారథి చెప్పారు.