తెలంగాణలో గ్రూప్-2కు గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2019-06-03 16:40:31  group 2

తెలంగాణలో గ్రూప్-2కు హైకోర్టు లైన్ క్లియరెన్స్ ఇచ్చింది. తీసేసిన 343 మంది అభ్యర్థులను పునఃసమీక్షించాలని కోర్టు ఆదేశించింది. టిఎస్‌పిఎస్‌సి టెక్సికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. కోర్టు తీర్పుతో తీసేసిన 343 మంది అభ్యర్థులకు ఊరట లభించింది. ఇప్పటికే 1032 పోస్టులకు 1: 3 రేషియోలో 3147 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన 3147 మంది అభ్యర్థులకు వెరిఫికేషన్ పూర్తి చేశారు. హైకోర్టు తీర్పుతో 1:2 రేషియోలో మళ్లీ వెరిఫికేషన్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 2016, నవంబర్ 11, 13 తేదీల్లో జరిగిన గ్రూప్-2 రాత పరీక్షల్లో సరిగా బబ్లింగ్ చేయని, వైట్‌నర్ ఉపయోగించిన వారిని మౌఖిక పరీక్షలకు(ఇంటర్వ్యూలకు) అనుమతించరాదని హైకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. వారిని మినహాయించి మిగిలిన వారిని ఇంటర్వ్యూలకు అనుమతించాలని గతంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రూప్-2 ద్వారా 1032 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2015 నోటిఫికేషన్ జారీ చేసింది. వైట్‌నర్ వినియోగించిన, బబ్లింగ్‌లో, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసినవారిని కూడా టీఎస్‌పీఎస్సీ అర్హులుగా గుర్తించడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతారని, గ్రూప్-2 నియామకాలను నిలిపేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి, పలువురు వేరువేరు పిటిషన్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు.