ఆ ఫోన్ కాల్ నా కెరీర్ ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది!

SMTV Desk 2019-06-03 16:36:45  sachin tendulkar, sir viv richards

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో తన రిటైర్మెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాను 2007లోనే రిటైర్మెంట్ గురించి ఆలోచించానని, అయితే విండీస్ దిగ్గజం విప్ రిచర్డ్స్ నుంచి వచ్చిన ఫోన్ తో తన మనసు మార్చుకున్నానని సచిన్ తెలిపాడు.2007 ప్రపంచకప్ తోనే నా కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకున్నాను.. ఆ ప్రపంచకప్ తర్వాత ఇక క్రికెట్ కు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నానని సచిన్ అన్నారు. అయితే ఆ సమయంలో భారత్ క్రికెట్ చుట్టూ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో మనకు కొన్ని మార్పులు అవసరం అనిపించింది. ఇక ఆ మార్పులు జరగకపోయి ఉంటే క్రికెట్ నుంచి తప్పుకుందాం అనుకున్నా.. కానీ అప్పుడే నా సోదరుడు 2011 ప్రపంచకప్ ఫైనల్ భారత్ లో జరుగుతుందని చెప్పాడు.. ఒక్కసారి ఆ ట్రోఫీని చేతిలోకి తీసుకున్నట్లు ఊహించుకో అని అన్నాడు. ఇక ఆ సమయంలోనే సర్‌ వివ్‌ రిచర్డ్స్ నుంచి ఫోన్ వచ్చింది. నీలో ఇంకా చాలా క్రికెట్‌ ఉంది అని ఆయన చెప్పాడు. మేం 45 నిమిషాలు మాట్లాడుకున్నాం. నా బ్యాటింగ్‌ హీరో నాకు ఫోన్‌ చేసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది అని సచిన్‌ మీడియాతో పంచుకున్నాడు.