పడవకి రంధ్రం... ముగ్గురు మృతి…

SMTV Desk 2019-06-03 16:32:25  Boat Capsize,

తూర్పు గోదావరి: జిల్లాలోని డొంకరామి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో సోమవారం పడవ మునిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు. చిన్నారి మృతదేహం లభ్యం కాగా మహిళల మృతదేహలు లభ్యం కాలేదు. మృతులంతా మల్కన్ గిరి జిల్లా శివారు గుర్రాలూరుకు చెందిన వారు. సరుకుల కోసం సీలేరుకు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహల కోసం వెతుకుతున్నారు. పడవ కి రంధ్రం ఉండటంతో పడవలోకి నీరు చేరడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.