పాన్ కార్డ్ హెచ్చరిక....రూ.10,000 జరిమానా

SMTV Desk 2019-06-03 16:19:49  pan card

దేశీ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు లేదా ఆపైన విలువైన లావాదేవీలు నిర్వహించిన ఉంటే కచ్చితంగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి అని గతేడాదే ఓ నోటిఫికేషన్ వచ్చింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) దీన్ని రిలీజ్ చేసింది. సంబంధిత కంపెనీలు మే 31 నాటికే పాన్ కార్డు కోసం అప్లై చేసుకొని ఉండాలి. అలాగే ఈ కంపెనీ హెడ్స్ కూడా పాన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్, భాగస్వామి, ట్రస్టీ, ఫౌండర్, సీఈవో వంటి పలువురు ఈ జాబితాలో ఉన్నారు. మీరు ఒకవేళ ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను అనుసరించి ఉండకపోతే మీకు రూ.10,000 జరిమానా పడుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ రూల్‌ను పాటించకపోవడంతో ఈ జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది. అసెసింగ్ అధికారి ఈ జరిమానా విధించొచ్చు.