కాంట్రాక్టు అధ్యాపకులకు 12 నెలల వేతనానికి ఉత్తర్వులు జారీ.. జగన్ మరో సంచలనం

SMTV Desk 2019-06-03 15:48:51  Jagan, Contract employees,

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభ వార్త అందించారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇక 12 నెలల వేతనం ఇవ్వనున్నారు ఈ మేరకు జీ ఓ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో 4000 మంది కాంట్రాక్ట్ అధ్యపకులకి లబ్ది చేకూరుతుంది . ఇంత వరకూ కేవలం సంవత్సరంలో 10 నెలలు మాత్రమే జీతాలు అందేవి కళాశాలకు ఉండే సెలవుల్లో వేతనాలు అందక కాంట్రాక్ట్ అధ్యాపకుల కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడేవి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వారి కలను సాకారం చేశారు. కాంట్రాక్టుఅధ్యాపకులకు 12 నెలలకు పూర్తి వేతనాన్ని ఇవ్వాలని ఆయన ఇచ్చిన ఆదేశం అప్పటికప్పుడే జీవో రూపం దాల్చింది. దీంతో ఈ ఉత్తర్వులకోసం 19 ఏళ్ల నుంచి ఆందోళనలు, ధర్నాలు, విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వెలుగులు నింపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 3,800 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు గత ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి వర్తించే విధంగా ఏడాదికి 12 నెలలకు వేతనం చెల్లించే విధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్‌ దాస్‌ ఉత్తర్వులు విడుదల చేశారు.
ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల తమ కృతజ్ఞతను తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం..