వరల్డ్‌కప్‌లో నేడు రెండో మ్యాచ్ ఆడనున్న ఇంగ్లాండ్, పాక్

SMTV Desk 2019-06-03 15:44:12  paksitan vs england

నాటింగ్‌హామ్: ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్ తో పాకిస్తాన్ తలపడనుంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్ కావడం గమనార్హం. టోర్నమెంట్ ప్రారంభ మాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాట్ చేసిన ఇంగ్లాండ్ 300కు పైగా పరుగుల చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో సేమ్ బలంతోనే బరిలోకి దిగాలని ఇంగ్లాండ్ యోచిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరగిన మాచ్‌లో అద్భుతంగా రాణించిన ఆర్చర్‌కు తోడుగా మరో ఫాస్ట్ బౌలర్ మార్క్ ఉడ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆ జట్టు అనుకుంటోంది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మాచ్‌లో ఘోర పరాజయం తర్వాత అన్ని వైపులనుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ జట్టు ఈ మాచ్‌లోనైనా పూర్తి సత్తా ప్రదర్శించాలని ఎంతో పట్టుదలతో ఉంది.ఆ మ్యాచ్‌లో పాక్ జటులో కొంతమేరకైనా రాణించింది మహమ్మద్ ఆమిర్ మాత్రమే. కాగా, ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్ ఆసిఫ్ అలీని జట్టులోకి తీసుకోవాలని కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అనుకుంటున్నాడు.