ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తి

SMTV Desk 2019-06-03 15:29:36  Love, Suicide, cheat

ప్రేమ పేరుతో యుగంధర్ గౌడ్ అనే యువకుడు ఓ యువతిని వేధిస్తూ వెంట పడ్డాడు. ఆమె తన ప్రేమను నిరాకరించడంతో తనతో ఆ యువతి సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడుతానని బెదిరించాడు. దీంతో సదరు యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో యుగంధర్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు జీవితం తనలో మార్పు తెచ్చిందని, తనకు బెయిల్ ఇవ్వాలని యుగంధర్ గౌడ్ కోర్టును ఆశ్రయించాడు. కొద్ది రోజులు మంచిగానే ఉన్న యుగంధర్ గౌడ్ మళ్లీ సదరు యువతిని వేధించడం మొదలు పెట్టాడు. సదరు యువతి, యుగంధర్ ఇంటర్ ఒకే కాలేజీలో చదివారు. అనంతరం ఇద్దరు జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం చేసేవారు. యుగంధర్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో సదరు సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. బెయిల్ పై వచ్చిన తరువాత యుగంధర్ తనను పెళ్లి చేసుకోవాలని సదరు యువతిని మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. అయితే ఆ యువతి నిరాకరించింది. దీంతో గద్వాలలో ఉన్న సదరు యువతి ఇంటికి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యుగంధర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.