ఎన్డీయే మంత్రివర్గంలో చేరే ప్రసక్తే లేదు

SMTV Desk 2019-06-03 15:18:09  Nitish, Modi,

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. బీజేపీకి మిత్రపక్షమైన తమకు కేవలం ఒక కేంద్ర మంత్రి పదవినే ఇస్తామని చెప్పినందుకు దీటుగా స్పందించారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి, జేడీయూ నేతలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అక్కడితో ఆగకుండా భవిష్యత్తులో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మంత్రివర్గంలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే జేడీయూ తుది నిర్ణయమని ప్రకటించారు. దీంతో బిహార్‌లో బీజేపీకి కీలక మిత్రపక్షమైన జేడీయూ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నట్లు స్పష్టమవుతోంది. జేడీయూ సెక్రటరీ జనరల్ కే సీ త్యాగి ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీకి కేవలం ఒక మంత్రి పదవిని మాత్రమే ఇవ్వజూపారన్నారు. తమ పార్టీకి ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. అందుకే ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.