రాశిఖన్నా అందాలు అదరహో

SMTV Desk 2019-06-03 15:15:04  rashikanna

‘తొలిప్రేమ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ రేంజ్‌కి వెళ్తుందనుకున్న సమయంలో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో చతికిలపడింది యంగ్ బ్యూటీ రాశీఖన్నా. అయినా ఈ భామ ఆఫర్లకేం లోటు లేదు. ఇటు తెలుగులో అటు తమిళ్‌లో కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇటీవల విశాల్‌తో ‘అయోగ్య’ సినిమాతో హిట్ కొట్టింది. తెలుగు ‘టెంపర్’కి తమిళ రీమేక్ ఇది. మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోందిప్పుడు. ఇక తెలుగు విషయానికి వస్తే ’వెంకీ మామ’ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. మరోవైపు సంచలన హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. అయితే రాశీఖన్నాకు గ్లామర్ టచ్ కాస్త ఎక్కువే. ఫేస్‌లో క్యూట్ అప్పీల్ ఉన్నా, ఫిజిక్‌లో హాట్ అప్పీల్ కూడా పుష్కలంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మలో. తాజాగా సోషల్ మీడియాలో తన హాట్ క్లీవేజ్ ఫోటోలను పోస్ట్ చేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.