అమెజాన్‌ వెబ్‌ సర్వీసుల అధ్యక్షుడిగా పునీత్‌ చందోక్‌?

SMTV Desk 2019-06-03 15:02:04  Amazon Web Services may appoint Mckinseys Puneet Chandok as new director

న్యూఢిల్లీ: అమెజాన్‌ వెబ్‌ సర్వీసుల ఇండియా విభాగానికి నూతన అధ్యక్షుడిగా పునీత్‌ చందోక్‌ను నియమించనున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రకటించింది. కాని దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. అమెజాన్‌ వెబ్‌సర్వీసులు కీలకమైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను అందజేస్తుంది. ఈ సేవలను భారత్‌లో ప్రారంభించినప్పటి నుంచి బిక్రమ్‌ బేడీనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బిక్రమ్‌ బేడీ నుంచి ఈ పగ్గాలను పునీత్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం పునీత్‌ చందోక్‌ మెకిన్సీ అండ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు.