24 గంటల్లో సీమ, కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు…

SMTV Desk 2019-06-02 15:16:20  Varshalu, rains,

దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, మధ్య మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది.కేరళకు ఆనుకుని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.వీటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాపైకి దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.దీంతో రాయలసీమలో శుక్రవారం అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురిశాయి.రానున్న 24 గంటల్లో సీమ, కోస్తాల్లో పలుచోట్ల గంటకు 30-40కి.మీ. వేగం తో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.కాగా శుక్రవారం రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల 40డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తిరుపతిలో 43డిగ్రీలు నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తాలో ఎండలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేశారు.ఈనెల 4నుంచి ఉత్తర కోస్తాలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు.