ఆయ‌న డేరా బాబా అయితే ఈయ‌న‌ జ‌గ‌న్ బాబా అని ఎందుకు అన్నానంటే: చంద్రబాబు నాయుడు

SMTV Desk 2017-08-28 18:57:55  AP CM, chandrababu naidu, Chief minister, TDP, Jagan, Andhra Dera baba

అమరావతి, ఆగస్ట్ 28: అంతమంది అభిమానులు, మంచి సంస్థ ఉన్న కూడా డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ బాబా వాటిని దుర్వినియోగ పరిచాడు. డేరా బాబా అమ్మాయిలతో నడచుకొనే తీరు నేడు అందరికి తెలిసిందని ఏపీ సీఎం ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సాధువులు ఎవరు కూడా ఇలా ప్రవర్తించరని ఆయన అన్నారు. అదేవిధంగా ఆంధ్రలో వైసీపీ అధినేత జగన్ కూడా ఒక వ్యక్తి ఎంత దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించ‌వ‌చ్చో చూపిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... జగన్ ప్రవర్తనా శైళి కూడా డేరా బాబాను తలపిస్తుందని, అస‌భ్య‌ ప్ర‌వ‌ర్త‌న, అసెంబ్లీని జ‌ర‌గ‌కుండా చేసే తీరు, ఆయ‌న చేస్తోన్న కుట్ర‌లు, కుతంత్రాలు ఎలాంటివో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని చంద్రబాబు అన్నారు. కొన్ని నెలల క్రితం జగన్ జాగ్ర‌త్త‌గా ఉండు సీఎంతో మాట్లాడుతున్నావ్ అంటూ అధికారులను బెదిరించారని అందుకే తాను నిన్న ఆయ‌న డేరా బాబా అయితే ఈయ‌న‌ జ‌గ‌న్ బాబా అన్నానని వివరించారు. జగన్ ఎక్కడికి వెళ్ళిన ఇలానే అధికార దుర్వినియోగం చేస్తున్నాడని, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడని చంద్రబాబు తెలిపారు.