కొడుకును చంపిన తల్లి......దేనికో తెలిస్తే షాక్

SMTV Desk 2019-06-02 13:14:19  anname blessing

72 ఏళ్ల కొడుకును 92 ఏళ్ల తల్లి అంతమొందించిన దారుణ సంఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. కుమారుడిని తల్లి ఎందుకు చంపిందో తెలుసా? కొడుకు ఆమెను నర్సింగ్ హోమ్‌లో చేర్పిస్తానని చెప్పడమే. గతేడాది వేసవి కాలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా పోలీసులు విడుదల చేశారు. 92 ఏళ్ల అన్నా మే బ్లెస్సింగ్ అనే వృద్ధురాలు ఈ ఘాతుకానికి పాల్పడింది.

పోలీసుల విచారణలో బ్లెస్సింగ్ తన కుమారుడిని తానే తుపాకీతో కాల్చి చంపినట్లు తెలిపింది. అంతేగాక అదే గన్‌తో కొడుకు ప్రియురాలిని కూడా బెదిరించినట్లు చెప్పింది. తనను నర్సింగ్ హోమ్‌కు వెళ్లాలని చెప్పడంతో అతణ్ణి అంతమొందించినట్లు వివరించింది. ఈ ఏడాది మార్చిలో ఈ హత్యకేసు విచారణకు వచ్చింది. కానీ, బ్లెస్సింగ్ జనవరిలోనే కన్నుమూసింది. అయితే, ఆమెను విచారించిన సమయంలో తీసిన వీడియోను అరిజోనా పోలీస్ అధికారులు తాజాగా విడుదల చేశారు.