మీకు పెళ్లి కావట్లేదా.. దగ్గరిదాకా వచ్చి ఆగుతున్నాయా .. ఇలా చేయండి

SMTV Desk 2019-06-02 13:09:29  Marrige, cancels,

చాలామంది వివాహాలు కావట్లేదని బాధపడుతుంటారు. సంబంధాలు దగ్గరికి వచ్చి పోతున్నాయా? నోటిదాకా వచ్చి క్యాన్సల్ అవుతున్నాయా? అయితే తప్పక మీ జాతకంలో కుజదోష ఉండటమేనని జ్యోతిష పండితుల అభిప్రాయం. అసలు కుజదోషం అంటే ఏమిటో తెలుసుకుందాం.. కుజదోషం అనగా జాతకచక్రంలో లగ్నం నుంచిగాని, చంద్రుడు ఉన్న రాశి నుంచిగాని శుక్రుడు ఉన్నరాశి నుంచిగాని 2,12, 4, 7, 8 రాశుల్లో కుజుడు ఉన్న దోషం. కుజుడు కళత్ర (భార్య/భర్త) స్థానం నాశనం చేయువాడు. శుక్రుడు కళత్ర కారకుడు. వీరిరువురి కలయిక లేక శుక్రునిపై కుజద్రుష్టి వధు, వరూలలో ఏ ఒక్కరి జాతకంలో ఉన్న అది కుజదోషం. ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరికి లేకుంటే వారిద్దరికి వివాహం చేయకూడదు. ఇద్దరికి కుజదోషం ఉంటే వారికి వివాహం చేయవచ్చు.

కర్కాటక, సింహ, మేష, వఋశ్చిక, ధనస్సు, మీన, మకర లగ్న జాతకులకు కుజదోషం ఉండదు. అదేవిధంగా జన్మనక్షత్రములు అశ్విని, మఋగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారికి కుజదోషం ఉండదు.
పరిహారాలు
మంగళవారం కుజగ్రహానికి శాస్త్ర పరిహారాల ప్రకారం పూజ, దానం, హోమం వంటి కార్యక్రమాలు చేసుకోవాలి.
– ఆర్థికంగా శక్తి లేనివారు భక్తి శ్రద్ధలతో కుజగ్రహానికి ఎర్రని పూలు, ఎర్రని వత్తులతో దీపారాధన, ఎర్రని అక్షింతలతో అర్చన చేయాలి.
– అమ్మవారి దేవాలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం దీపారాధన, అర్చన చేస్తే కుజదోషాలు పోతాయి.
– పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని జ్యోతిషులు, పురోహితులను సంప్రదించి మీమీ జాతకచక్రాల విశ్లేషణ ఆధారంగా పూజ చేసుకుంటే తప్పక మీ కుజదోషం పోతుంది.