న‌గ్నంగా మందు కొట్టాలనుందా .. అయితే ఈ పబ్ కి వెళ్ళండి

SMTV Desk 2019-06-02 13:08:43  nudist pub, londan,

లండ‌న్‌లోని సోహో ప్రాంతంలో 1847 నుంచి ద కోచ్ అండ్ హార్సెస్ అనే ప‌బ్ కొన‌సాగుతోంది. గ‌తంలో దీన్ని చాలా మంది కొనుగోలు చేయాల‌ని చూశారు. కానీ దీన్ని ఎవ‌రూ చేజిక్కించుకోలేక‌పోయారు. ఇక లండ‌న్‌లో ఏర్పాటు చేసిన తొలి శాఖాహార ప‌బ్‌గా కూడా ఈ ప‌బ్‌కు ఎంత‌గానో పేరుంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడీ ప‌బ్ న్యూడిస్ట్ ప‌బ్‌గా మారింది. అందులో ఇక‌పై క‌స్ట‌మ‌ర్లే కాదు, అక్క‌డ ప‌నిచేసే సిబ్బంది కూడా న‌గ్నంగా తిర‌గ‌వ‌చ్చు. క‌స్ట‌మ‌ర్లు న‌గ్నంగా మందు కొడుతూ ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

కాగా ఈ ప‌బ్‌లో క‌స్ట‌మ‌ర్లు, సిబ్బంది న‌గ్నంగా తిరిగేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం ఇటీవ‌లే అనుమ‌తినిచ్చింది. దీంతో ఇక‌పై ఈ ప‌బ్ న్యూడిస్ట్ ప‌బ్‌గా మార‌నుంది. అయితే న్యూడిస్ట్ ప‌బ్ అని చెప్పి అందులో ఎప్పుడు ప‌డితే అప్పుడు బ‌ట్ట‌లు లేకుండా తిరుగుదాం.. అంటే కుద‌ర‌దు. అందుకు ఓ స‌మ‌యం ఉంటుంది. ఆ ప‌బ్ వారు ఫ‌లానా తేదీ, ఫ‌లానా స‌మ‌యంలో ప‌బ్‌లో న‌గ్నంగా తిర‌గ‌వ‌చ్చు.. అని ముందుగా తెలియ‌ప‌రుస్తారు. దీంతో ఆ వివ‌రాల‌ను తెలుసుకుని.. ఆ తేదీ, స‌మ‌యం చూసుకుని మ‌రీ ప‌బ్‌లోకి వెళ్లి న‌గ్నంగా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా.. ఈ న్యూడిస్ట్ ప‌బ్ మాత్రం ఇప్పుడు లండన్‌లో న్యూడిస్ట్‌ల‌ను విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.. చూద్దాం మరి.. ఇంకా ఇలాంటి ప‌బ్‌లు ఎన్నివ‌స్తాయో.. ఎక్క‌డ వ‌స్తాయో..!