డేరా బాబా ఇక జైలు పక్షి,..

SMTV Desk 2017-08-28 18:43:42  GURMITH SINGH, DERRA BABA GURMITH SINGH, JAILU SHIKSHA, HARYANA, PANJAB, CBI COART,

హర్యానా ఆగస్ట్ 28: అత్యాచార కేసులో దోషిగా డేరా బాబా గుర్మిత్ రామ్ రహీంసింగ్ ని నిర్దారించిన సిబిఐ కోర్టు, రోహ్తక్ నగర శివారులోని తాత్కాలిక ప్రాంతంలో కోర్టును ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలలో అసాధారణ రీతిలో ఏర్పాట్లు చేసారు. రోహ్తక్ జైలులో సిబిఐ న్యాయవాదులు గుర్మిత్ సింగ్ కి జీవితఖైదీ శిక్ష విధించాలని వాదించారు. దీంతో డేరా బాబా క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుకున్నాడు. అదేవిధంగా కోర్టులో కన్నీరుమున్నీరు అయి కుప్పకూలిపోయాడు. సిబిఐ కోర్టు 2002 నాడు జరిగిన అత్యాచార కేసులో డేరా బాబా కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జైలులో గుర్మిత్ కు ఖైది నెంబర్ 1997 గా కేటాయించారు. ఈ సందర్బంగా రాష్ట బలగాలు, కేంద్ర బలగాలు అప్రమత్తం అయ్యాయి పంజాబ్, హర్యానా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.