సైనిక రంగంలో అత్యుత్తమ సాంకేతికత భారత్ సొంతం

SMTV Desk 2017-08-28 18:17:27  Arun Jaitley, Minister of Defence, missiles, Mithani BDL, Solar power plant

హైదరాబాద్, ఆగస్టు 28 : భారత దేశ సరిహద్దుల్లో నెలకొంటున్న పరిస్థితుల దృష్ట్యా రక్షణ శాఖ తగిన విధంగా స్పందిస్తోందని, దీనిపై ఉన్నత ప్రమాణాలను కలిగిన విద్యను అందించాలని కేంద్ర ఆర్థిక ,రక్షణ శాఖమంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. రాజధానిలో మిధానీ బీడీఎల్ లో నూతనంగా రూపొందించిన మిస్సైల్ తో పాటు యుద్ద టాంకర్ ను రక్షణ శాఖకు అంకితం చేశారు. ఈ మేరకు 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్ళాలని అరుణ్ జైట్లీ సూచించారు. భారత్ లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మానవ వనరులు అధికంగా ఉన్నాయన్నారు. భారతీయులు విదేశాల్లో సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించిన జైట్లీ శాస్ర సాంకేతిక విజ్ఞానం, రక్షణ రంగంలోనూ వారు సేవలందిస్తున్నారని ఆయన వివరించారు.