ఓపెన్‌ డిగ్రీ ప్రాక్టికల్స్‌ వివరాలు

SMTV Desk 2019-06-01 14:04:20  open degree practicals

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ తృతీయ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 7 నుంచి 16 వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ టి.వి.దుర్గాప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలు విజయవాడ, గుంటూరు కేంద్రాల్లో జరుగుతాయని వివరించారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కాలేజీలో 7న ఫిజిక్స్‌, 8న కెమిస్ర్టీ, 9న బోటనీ, 10న జువాలజీ, 11న సైకాలజీ, 12న గుంటూరు జేకేసీ కాలేజీలో జువాలజీ ప్రాక్టికల్స్‌ జరుగుతాయన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 12న సైకాలజీ, 13న ఫిజిక్స్‌, 14న కెమిస్ట్రీ, 15న బోటనీ, 16న జువాలజి ప్రాక్టికల్స్‌ గుంటూరు జేకేసీ కాలేజీలో జరుగుతాయన్నారు. వివరాలకు విజయవాడ కాలేజీ 0866-2434868, 7382929642 నెంబర్లకు, గుంటూరు కాలేజీ సెంటర్‌ నెంబర్లు 0863-2227950, 7382929605లకు సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.