త్వరలో వాట్సాప్‌లో బిజినెస్..!

SMTV Desk 2017-08-28 17:48:20  MESSENGER APP, NEW FEACHER, BUSSINES VERIFIED ACCOUNT.

న్యూఢిల్లీ, ఆగస్ట్ 28 : ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. వాట్సాప్‌లో కూడా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌కు మాదిరి వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో బిజినెస్ ప‌రంగా కూడా వాట్సాప్ సేవ‌ల‌ను వినియోగించుకోవడానికి వీలుంటుంది. కాగా ఇప్పటికే కొన్ని అకౌంట్‌లను తనిఖీ చేశామని వాట్సాప్‌ వెల్లడించింది. ఈ స‌దుపాయం వల్ల ఫోన్‌బుక్‌లో ఉన్న బిజినెస్ కాంటాక్ట్ నంబర్లకు ప్రత్యేకంగా ఆకుపచ్చ బ్యాడ్జ్‌తో పాటు, తెలుపు రంగు టిక్‌మార్కు ఉండనుంది. ఒకవేళ ఆ కాంటాక్ట్‌తో బిజినెస్ చేసే ఉద్దేశం లేక‌పోతే ఇతర ఖాతాల మాదిరిగానే బ్లాక్‌ చేసే సౌలభ్యం కూడా ఉందని కంపెనీ పేర్కొంది. ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు కాంటాక్ట్ వ‌ద్దనే క‌నిపిస్తాయ‌ని సంస్థ వెల్లడించింది.