ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

SMTV Desk 2019-06-01 13:52:34  uttham kumar reddy

ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 3వ తేదీన ఆయన తన రాజీనామా లేఖ అందించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్‌ హుజుర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌ విజయాన్ని దక్కించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పదవి వదులుకోవాలని నిర్ణయించారు. ఉత్తమ్‌ రాజీనామా చేస్తే ఆరు నెలల్లోగా హుజుర్‌నగర్‌కు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.