ఈ సారి కూడా వడ్డీ రేట్లు తగ్గవచ్చు ...!

SMTV Desk 2019-06-01 13:49:36  Interest rates,

ఈ సారి కూడా వడ్డీ రేట్లు తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తూ జూన్ సమీక్షలో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వారు ఊహించినట్టుగానే తాజాగా ప్రకటించిన జిడిపి గణాంకాలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. జనవరిమార్చి కాలంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 5.8 శాతం నమోదు చేసింది. రెండేళ్లలో తొలిసారి చైనా దిగువకు మన జిడిపి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో జిడిపి వృద్ధి రేటు వరుసగా 7.1 శాతం, 6.6 శాతం, 5.8 శాతం నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి ఏడు త్రైమాసికాల కనిష్ఠానికి 6.1శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని డిబిఎస్ గ్రూప్ రీసెర్చ్ అంచనా వేయగా, అంతకంటే దిగువ వృద్ధి రేటు పడిపోయింది. ఆర్‌బిఐ రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్‌లో జరగనుంది.