కావేరీ బస్సుకు బ్రేకులు ఫెయిల్.. ప్రాణభయంతో 40 మంది ప్రయాణికులు!

SMTV Desk 2019-06-01 12:38:24  kaveri bus

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో ఈరోజు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరిలోని ఆచంట నుంచి హైదరాబాద్ కు వెళుతున్న కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈరోజు ఉదయం కృష్ణాజిల్లాలోని అనాసాగరం వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు డ్రైవర్ తెలిపారు. ఈ ఘటన ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని సమాచారం. మరోవైపు బస్సు డివైడర్ పై ఇరుక్కుపోవడంతో ప్రయాణికుల కోసం మరో వాహనాన్ని కావేరీ యాజమాన్యం ఏర్పాటు చేసింది.