పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే .. జగన్ సంచలనం

SMTV Desk 2019-06-01 12:25:48  Jagan, school students

నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏపీ సీఎం జగన్ ‌మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. విద్యార్థులకు రోజు వారీ పాఠాల బోధన, పుస్తకాల మోతకు భిన్నంగా ఆట పాటలతో ఉత్సాహ పరచాలనుకుంటున్నారు. దీంతో పాటు ప్రతిరోజు అరగంట ఆనంద వేదిక తరగతులు నిర్వహణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండోసారి జరుగబోయే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సమగ్ర నివేదికను అందించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఆటపాటలతో వారిలో పాఠశాలలంటే వున్న భయాన్ని పోగొట్టడానికి ఈ కార్యక్రమం దోహదపడేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూటాన్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయి. జూన్‌ 3న గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ కార్యక్రమ అమలుపై వారి సూచనలు, సలహాలను తీసుకోనున్నారు. ఇక ఇదే సిస్టంని యూపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అమలు చేసింది. విద్యార్థులకు కాస్త ఉపశమన. ఉల్లాస, సంతోషభరితమైన కార్యక్రమాలు చేయించడం వలన పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్‌తో పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుందని భావిస్తూ వారు చేపట్టిన ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో ఏపీలో కూడా దానిని అమలు పరచనున్నరు