సొంత డబ్బుతో ఆర్టీసీ బ‌స్సులో వై - ఫై

SMTV Desk 2017-08-28 17:25:27  RTC Bus, Madurai, Wi-Fi RTC bus, High class RTC Bus

మధురై, ఆగస్ట్ 28: ప్రయాణికులను ఆకట్టుకుని ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు మధురైకి చెందిన కండక్టర్ ఒక వినూత్న ప్రయత్నం చేశారు. తన సొంత డబ్బుతో బ‌స్సులో వై - ఫై సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగిపోకుండా ప్రైవేట్ బస్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉండేందుకు అన్ని ర‌కాల ఆధునిక హంగులు తీర్చిదిద్దడు. రామాంత‌పురం నుంచి తంజావూర్ వయా మధురై వెళ్లే బ‌స్సుకి ఈయ‌న త‌న సొంత ఖ‌ర్చుతో లైటింగ్‌, స్పీక‌ర్లు, వై-ఫై సౌక‌ర్యాలు పెట్టించాడు. వీటన్నిటికీ సుమారు రూ. 15000 దాకా ఖర్చు చేసినట్లు సదరు కండక్టర్ తెలిపారు. కాగా, ఇది అంతా మ‌ధురైకి చెందిన మ‌ట్టుథావ‌ని బ‌స్‌స్టేష‌న్‌లో కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న జ‌య‌బాలాజి చేశాడు. ఈ సరికొత్త ప్రయత్నంతో మంచి ఫలితం సాధించినట్లు కండక్టర్ జ‌య‌బాలాజి తెలియజేశారు. అదే దారిలో వెళుతున్న ఇతర బస్సులను కాదని ప్రయాణీకులు తమ బస్సు ఎక్కుతున్నట్లు కండక్టర్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. తాను పెట్టించిన వై - ఫై సౌక‌ర్యం కారణంగా పిల్లలు, పెద్ద‌లు, యువ‌త‌, మ‌హిళ‌లు ఈ బ‌స్సులో ప్ర‌యాణం చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నార‌ని జ‌య‌బాలాజి తెలిపారు.