మూవీ రివ్యూ :

SMTV Desk 2019-06-01 12:02:03  ngk, ngk movie

స్టార్ హీరో సూర్యకు అటు తమిళ్ తో మన దగ్గర కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.వైవిధ్య చిత్రాల దర్శకుడు అయినటువంటి సెల్వరాఘవన్ తో మొట్టమొదటిసారిగా తెరకెక్కించిన చిత్రం “ఎన్.జి.కె”. ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.సాయి పల్లవి మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజే విడుదల అయ్యింది.మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే (సూర్య) నంద గోపాల కృష్ణ తన భార్య సాయి పల్లవి మరియు ఇతర కుటుంబ సభ్యులతో జీవనం సాగించే సామాన్య రైతు.కొన్ని అనుకోని పరిస్థుతుల ద్వారా సూర్య ఒక రైతు నుంచి రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది.ఒక కార్యకర్తగా మొదలై పార్టీలో బలమైన నాయకుడిగా సూర్య ఎలా ఎదగగలిగాడు? ఈ కథకి రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్న సంబంధం ఏమిటి? తన రాజకీయ జీవితంలో ఎదురైన అవాంతరాల ముందు నిలదొక్కుకొని సూర్య తాను అనుకున్నది సాధించాడా లేదా అన్నది వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

సూర్య ఎంతటి విలక్షణ నటుడో మన అందరికీ తెలుసు అలాగే సెల్వరాఘవన్ దర్శకత్వం కోసం కూడా ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు.కానీ వీరిద్దరి నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా కావడంతో కాస్త పాజిటివిటి ఏర్పడినా ఇప్పటికే ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.అందువల్ల ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏమంత కొత్తగా ప్రేక్షకులకు అనిపించదు.ఈ విషయంలో సెల్వ రాఘవన్ కాస్త తడబడ్డారు.అంతే కాకుండా తన మొదటి సినిమా నుంచి సెల్వ రాఘవన్ సమాజంలో ఉండే వ్యక్తులు మరియు పాత్రలను ఎంత నాచురల్ గా చూపించే వారో అందరికీ తెలుసు.

ఓ సారి 7/జి బృందావన కాలనీ అలాగే “ఆడవారి మాటాలకు అర్ధాలే వేరులే” సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది.అలాంటిది అంత నాచురాలిటీ ఈ సినిమాలో మిస్సయ్యినట్టు అనిపిస్తుంది.ఫస్టాఫ్ లో కథ మెల్లగా సాగినా సెల్వ రాఘవన్ తన కథనంతో పొలిటికల్ జానర్ లోకి కాస్త ఆసక్తికరంగా తీసుకెళ్లి తడబడినట్టు అనిపిస్తుంది.సెకండాఫ్ లో కూడా ఏమంత కొత్తదనం లేకపోవడం,అక్కడక్కడా సాగదీతగా అనిపించినా క్లైమాక్స్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది.

అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా కనిపించకపోడం మరో మైనస్ గా చెప్పాలి.ఈ విషయంలో ఆయన జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.అలాగే సూర్య భార్యగా సాయి పల్లవి మరో పవర్ ఫుల్ పొలిటిషన్ గా రకుల్ మంచి నటన కనబర్చారు.డబ్బింగ్ విలువలు బాగున్నాయి.యువన్ సంగీతం కూడా బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

సూర్య నటన
కొన్ని పొలిటికల్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో సాగదీత
గందరగోళానికి గురి చేసే కథనం

తీర్పు :

సెల్వరాఘవన్ మరియు సూర్యల కాంబినేషన్ లో వచ్చిన “ఎన్.జి.కె” ఊహించిన స్థాయి ఫలితాన్ని అందుకోవడంలో విఫలం అయ్యిందనే చెప్పాలి.ఏ మాత్రం కొత్తదనం లేని కథ ఇప్పటికే ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి సినిమాలు రావడం వల్ల ఈ సినిమాకు అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చలేకపోయాయి.అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిస్సవ్వడం వల్ల సినిమా చూసే ప్రేక్షకుడు ఏమంత గొప్పగా ఫీల్ కాకపోవచ్చు.మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు.