విద్యార్థుల హాజరుపై తమిళనాడు ప్రభుత్వం వినూత్న ప్రయత్నం.!

SMTV Desk 2017-08-28 16:47:47  TAMILNADU GOVERNMENT, STUDENT ATTENDENCE, SMART CARDS, DIGITALISATION.

చెన్నై, ఆగస్ట్ 28 : మైసూర్‌లోని హాల్ కేసారే గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠ‌శాల విద్యార్థుల హాజరును తెలుసుకునేందుకు ఇటీవ‌ల మొబైల్ యాప్ రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడదే కోవలో తమిళనాడు ప్రభుత్వం నడుస్తో౦ది. విద్యార్థుల హాజరు శాతం అంచనా వేయడానికి త్వరలో వారికి స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు సన్నాహాలు చేయనున్నట్లు తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టియాన్ స్పష్టం చేసారు. ఓ పాఠ‌శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరును తెలుసుకోవడానికి వారికి స్మార్ట్ కార్డులు అందించనున్నామని, ఈ కార్డుల వల్ల తల్లిదండ్రులకు కూడా ఉపయోగం ఉంటుందని వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన డిజిటలైజేష‌న్ ఆశ‌యంలో భాగంగా అన్ని స్కూల్ ఫీజు చెల్లింపుల‌ను, ఇతర వ్యవహారాలను కేవలం ఆన్‌లైన్ ద్వారానే కొనసాగేలా చూడాలని సీబీఎస్ఈ ఆదేశించింది.