భారత్‌కు అమెరికా హెచ్చరికలు

SMTV Desk 2019-06-01 11:27:23  russia, india, america

వాషింగ్టన్‌: అమెరికా భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం రష్యా నుండి ఎస్‌-400 క్షిపణీ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన కారణంగా భారత్‌ను హెచ్చరించింది. అయితే ఈ క్షిపణుల కొనుగోళ్లలో భారత్‌ ఆసక్తి చూపితే రక్షణ రంగ ఒప్పందాల్లో చిక్కులు తలెత్తుతాయని అమెరికా హెచ్చరింది. కాగా కౌంటరింగ్‌ అమెరికాస్‌ అడ్వైజరీస్‌ త్రూ శాంక్షన్‌ యాక్ట్‌ (సీఏఏటీఎస్‌ఏ) ప్రకారం మాస్కో నుంచి భారత్‌ ఎస్‌400 క్షిపణులను కొనుగోలు చేస్తున్న అంశం చాలా ప్రాధాన్యమైన అంశంగా అమెరికా అభిప్రాయపడింది. ఈ ఒప్పందంపై కేంద్రం గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. 5 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందంపై గత ఏడాది అక్టోబర్‌లో ఇరు దేశాధినేతలు సంతకాలు చేశాయి.