రేపు సాయంత్రం ఖోఖో సెలెక్షన్స్‌

SMTV Desk 2019-06-01 11:26:42  hyderabad, khokho sports selections

హైదరాబాద్: జూన్ 1న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో సబ్‌ జూనియర్‌ బాలబాలికలకు సెలెక్షన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సెలెక్షన్స్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఎంపికైన క్రీడాకారులు జూన్‌ 7 నుంచి 10 వరకు సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర అంతర్‌ జిల్లా సబ్‌ జూనియర్‌ ఖోఖో టోర్నీలో హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. వివరాలకు విలియమ్స్‌ (ఫోన్‌: 6303736367)ను సంప్రదించొచ్చు.