పాక్ ను చిత్తు చేసిన విండీస్...టార్గెట్ 106

SMTV Desk 2019-06-01 11:25:40  Pakistan vs west indies, icc world cup 2019

ప్రపంచకప్ మెగా టోర్నీలో భాగంగా నేడు పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జ్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలుత ఇన్నింగ్స్ చేసిన పాకిస్తాన్ 21.4 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆలౌటైంది. వెస్టిండిస్ ముందు 106 పరుగుల లక్ష్యాని పాక్ ఉంచింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ బ్యాట్స్ మెన్లలో ఫఖర్ జమాన్ (22), బాబర్ అజామ్(22), మహ్మద్ హఫీజ్(18), ఇమాబ్ హల్ హక్(2), సోహైల్(8), సర్ఫజా అహ్మద్(8), ఇమాద్ వసీం(1), హసన్ అలీ(1), షాదాబ్ ఖాన్(0) పరుగులు చేసి ఔటయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్, థామస్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా రస్సెల్ రెండు వికెట్లు, కొట్రెల్ ఒక వికెట్ తీశాడు.

Pakistan (Playing XI): Imam-ul-Haq, Fakhar Zaman, Babar Azam, Haris Sohail, Mohammad Hafeez, Sarfaraz Ahmed(w/c), Imad Wasim, Shadab Khan, Hasan Ali, Wahab Riaz, Mohammad Amir.

West Indies (Playing XI): Chris Gayle, Shai Hope(w), Darren Bravo, Shimron Hetmyer, Nicholas Pooran, Andre Russell, Jason Holder(c), Carlos Brathwaite, Ashley Nurse, Sheldon Cottrell, Oshane Thomas.