ప్రచారంలో ఓ మాట.....పదవిలో ఓ మాట - సోషల్ మీడియా వేదికగా జగన్ పై ట్రోల్స్

SMTV Desk 2019-05-31 15:39:11  jagan, YS jagan,

అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తదనంతరం ఆ పార్టీ మేనిఫెస్టో నవరత్నాల్లోని వృద్యాప్ప పెన్షన్ ఫైల్ పై తొలి సంతకం చేసారు.

అయితే ఎన్నికలకు ముందు అర్హులైన పెన్షన్ ధారులకు ప్రతి నెల రూ. 3000/- చొప్పున ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగా వైఎస్సాఆర్ పెన్షన్ కానుక కింద అవ్వాతాతలకు వచ్చే నెల నుండి రూ. 2,250/- పెన్షన్ అందిస్తామని వెల్లడించారు. దీన్ని వచ్చే ఏడాది రూ. 2,500/- చేస్తామనీ, మరుసటి ఏడాది రూ. 2,750/- కి పెంచుతామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ రూ. 3000/- వరకు చేస్తా అనడంలో జిమ్మిక్ ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు జగన్ ని ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా....ఎవరి అభిప్రాయం వారిది.