టైటిళ్లతో టోర్నీని ముగించిన భారత్

SMTV Desk 2019-05-31 15:31:30  ISSF Shooting World Cup, Manu Bhaker and Saurabh Chaudhary, 10m air pistol mixed team,

జర్మనీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్లు చెలరేగిపోయి టైటిళ్లను సొంతం చేసుకుని టోర్నీని ముగించేశారు. గురువారం జర్మనీలోని మ్యూనిచ్‌లో సాగుతున్న టోర్నీ చివరి పోటీలో భారత్‌ 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌(అంజుమ్‌ మోడ్గిల్‌, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌) పసిడిని సాధిం చగా, 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌(మను భాకర్‌, సౌరభ్‌ చౌదరీ)జోడీ కూడా పసిడిని సాదించారు.దీనితో భారత్‌ పసిడి పతకాల సంఖ్య ఐదుకు చేరింది. అపూర్వి చండీలా (మహిళల10మీ. ఎయి ర్‌ రైఫిల్‌)లో స్వర్ణం సాధించగా, రాహి సర్నోబత్‌ (మహిళల 25మీ. పిస్టల్‌) స్వర్ణం అందుకుంది. పురుషుల 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో సౌరభ్‌ చౌదరీ మరో స్వర్ణాన్ని సాధించడంతో భారత్‌ మొత్తం ఐదు స్వర్ణాలతో టాప్‌లో నిలువగా చైనా రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో రెం డో స్థానంలో నిలిచింది.