బాలీవుడ్: సల్మాన్‌ఖాన్ సినిమాపై వివాదం

SMTV Desk 2019-05-31 15:27:09  salman khan

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమాకు విడుదలకు ముందే కష్టాలు ప్రారంభమయ్యాయి. భారత్ సినిమా టైటిల్ ను మార్చాలని కోరుతూ విపిన్ త్యాగి అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. భారత్ పేరును వాణిజ్య అవసరాలకు వినియోగించడం సెక్షన్ 3 ప్రకారం ఉల్లంఘన కిందకు వస్తుందని, దీని పేరు మార్చాలని కోరుతూ విపిన్ త్యాగి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సల్మాన్ ఖాన్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించే ఈ సినిమాలో కట్రినా కైఫ్ హీరోయిన్ గా నటించారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకోవాలనుకున్నారు. నిక్ జోన్స్ తో పెళ్లి కారణంగా ఈ సినిమాలో నటించలేని ప్రియాంక చెప్పడంతో హీరోయిన్ ను మార్చారు. జూన్ నెల 5వతేదీన ఈద్ సందర్భంగా విడుదల చేయనున్న ఈ సినిమా టైటిల్ మారుతుందా లేదా అనేది కోర్టు తీర్పు కోసం ఎదురుచూడాల్సిందే.