ఆసిస్ కు షాక్...వార్నర్ కు గాయం

SMTV Desk 2019-05-31 13:54:35  david warner, australia

ఆస్ట్రేలియా జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సంచలన ఆటగాడు డేవిడ్ వార్నర్‌ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. అయితే గురువారం(30 మే 2019) వార్నర్‌కు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించగా.. అతను అన్‌ఫిట్‌ అని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో అఫ్గానిస్తాన్‌తో రేపు(1 జూన్ 2019) జరిగే ఫస్ట్ మ్యాచ్‌కు వార్నర్‌ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. వార్నర్‌ కుడితొంటిలో గాయమైందని, దాని నొప్పి కారణంగా వార్నర్‌ ఇబ్బంది పడుతున్నాట్లు ఇప్పటికే ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మీడియాకు వెల్లడించారు.అయితే వార్నర్‌కు గాయం కారణంగా ఆసిస్ జట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది.