ఎట్టకేలకు దిగివచ్చిన చైనా

SMTV Desk 2017-08-28 15:58:55  Doklam, china, india, Doklam border, Beijing,Bricks

న్యూఢిల్లీ, ఆగస్టు 28 : రెండున్నర నెలల డొక్లాం ప్రతిష్టంభన తెరపడేందుకు రంగం సిద్ధమైంది. భారత్ చైనా దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు పరస్పరం అంగీకరించినట్లు విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కారించుకుంటామన్నా భారత్ మాటే చెల్లినట్లు అయింది. చైనా ఎన్ని సార్లు తన వ్యాఖ్యలతో కవ్వించిన నిగ్రహంగా ఉన్న భారత విదేశాంగ శాఖ ఆఖరికి చర్చలతోనే ఈ సమస్యకి చరమగీతం పాడింది. సాధ్యమైనంత త్వరగా ఇరుదేశాలు సైన్యాన్ని డొక్లాం సరిహద్దు నుంచి ఉపసంహరించే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో బీజింగ్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశల వేళ ఈ నిర్ణయం కీలకంగా మారింది. భారత్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులో ఉన్న డొక్లాంలోకి జూన్ 16 న చైనాకు చెందిన పీపూల్ సెలబ్రేషన్ ఆర్మీ చర్చకు వచ్చింది. వెంటనే స్తంభించిన భారత దళాలు చైనా సైన్యాన్ని అడ్డుకున్నాయి. అప్పటినుంచి అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతుంది.