ప్రపంచకప్: పాకిస్తాన్, వెస్టిండీస్‌ల మధ్య రెండో మ్యాచ్

SMTV Desk 2019-05-31 13:08:18  Pakistan vs west indies, icc world cup 2019

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు పాకిస్తాన్, వెస్టిండీస్‌ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అయితే భారీ హిట్టర్లతో కూడిన విండీస్‌ను పాక్ ఎంతమేరకు నిలువరిస్తుందనేది చూడాలి. మరోవైపు ఆమిర్‌ వంటి నాణ్యమైన పేసర్లను కరీబియన్లు ఎదుర్కుంటారో చూడాలి. విండీస్ జట్టులో అందరూ హిటర్లే. ఓపెనింగ్ నుంచి దాదాపు చివరి బౌలర్ వరకు హిట్టింగ్ చేయగలరు. ఓపెనింగ్ లో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్ జట్టుకు పెద్ద అండ. గేల్‌కు తోడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించే ఎవిన్‌ లూయిస్‌ సైతం భారీ షాట్లతో హడలెత్తించగలడు. ఇక బౌలింగ్ దళం కూడా బాగానే ఉంది. రోచ్, కాట్రెల్‌ ప్రధాన పేసర్లు. పేస్‌ ఆల్‌రౌండర్లు హోల్డర్, రసెల్‌లు ఉండడంతో.. ఒషేన్‌ థామస్, గాబ్రియెల్‌లో ఒకరికే అవకాశం దక్కనుంది .ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సహా గత 10 వన్డేల్లో పాక్‌ ఓటములతో సతమవుతుంది. దీన్నిబట్టే పాక్ పరిస్థితి తెలుస్తోంది. అయితే ఈ అపజయాల పరంపరకు విండీస్‌పై విజయంతో అడ్డువేయాలని భావిస్తోంది. ఓపెనర్లు ఇమాముల్‌ హక్, ఫఖర్‌ జమాన్.. వన్‌డౌన్‌లో బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. అనంతరం హారిస్‌ సొహైల్, మొహమ్మద్‌ హఫీ, సర్ఫరాజ్‌లు ఆదుకునేందుకు ఉన్నారు. ఆమిర్, హసన్‌ అలీ, ఆఫ్రిది పేస్‌ త్రయం ఫామ్ అందుకోలేదు. బౌలింగ్‌లో పదును తగ్గడం పాక్ జట్టును ఆందోళన కలిగిస్తోంది. అయితే తమదైన రోజున ఆడగల సత్తా ఉంది.