బెన్ స్టోక్స్ కళ్లు చెదిరే క్యాచ్!

SMTV Desk 2019-05-31 13:05:28  ben stokes catch in world cup 2019

ప్రపంచకప్ టోర్నీలో ఆరంభ మ్యాచ్ ఇంగ్లాంగ్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగగా ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికాపై 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ విజయంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌ల్లో అద్భుతంగా రాణించాడు.ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. 35వ ఓవర్లో రషీద్ బౌలింగ్‌లో ఫెలుక్వాయో బంతిని డీప్ మిడ్ వికెట్లోకి బలంగా బాదాడు. బంతి అలవోకగా బౌండరీ దాటేలా కనిపించింది. కానీ స్టోక్స్ గాల్లో వెనక్కి ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో ఒంటి చెత్తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌పై పలువురు క్రికెట్ నిపుణులు ప్రశంసలు కురిపించారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సెన్ ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో అతి గొప్ప క్యాచ్‌గా అభివర్ణించాడు.