ఫ్రెంచ్ ఓపెన్: ముందంజలో జకోవిచ్, ఒసాకా

SMTV Desk 2019-05-31 13:03:54  novak jovovich, naomi osaka, french open

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా), నవోమి ఒసాకా (జపాన్)లు గురువారం జరిగిన రెండో రౌండ్‌లో విజయం సాధించి ముందంజ వేశారు. ఇకపోతే మహిళల సింగిల్స్‌లో మాజీ ఛాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఆస్ట్రేలియా స్టార్ ఆశ్లే బార్టీ జయభేరి మోగించారు. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వరెవ్, డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా) మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. నంబర్‌వన్ ఆటగాడు జకోవిచ్ రెండో రౌండ్‌లో అలవోక విజయం సాధించాడు. హెన్రి లాక్సోమన్(స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో జకోవిచ్ 61, 64, 63 తేడాతో జయకేతనం ఎగురవేశాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన జకోవిచ్ ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో ఐదో సీడ్ జ్వరెవ్ (జర్మనీ) విజయం సాధించాడు. స్వీడన్ ఆటగాడు మైఖేల్‌తో జరిగిన పోరులో జ్వరెవ్ 61, 63, 76తో జయభేరి మోగించాడు. మరోవైపు నాలుగో సీడ్ డొమినిక్ థిమ్ 63, 67, 63, 75తో చెమటోడ్చి నెగ్గాడు.